Saturday, January 26, 2008

రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు

విప్లవ సందేశం బ్లాగు పాఠకులందరికీ మా హార్దిక రిపబ్లిక్‌ డే (గణతంత్ర దినోత్సవ - అచ్చ తెలుగులో ఏమనాల్నో?) శుభాకాంక్షలు. కమ్యూనిస్టులేంటి, రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలేమిటి అని ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా? అక్కర లేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు దేశభక్తులుకూడానూ [నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని ఆ పార్టీవాళ్లు గోడలమీద రాసిన నినాదాలు చదివే వుంటారు], పైగా రిపబ్లిక్‌ డేకే నిజమైన స్వాతంత్ర్య దివసంగా పరిగణించబడే అర్హత వుంది గనుక. జై హింద్‌, ఇంకిలాబ్‌ జిందాబాద్‌, ఆఖరుకు వందే మాతరం నినాదాలుకూడ విప్లవకర దేశభక్తులు పాపులరైజ్‌ చేసినవే నని మనం గమనించాలి. కనుక వందే మాతరం, జై హింద్‌, విప్లవం వర్ధిల్లాలి అంటూ ముగిస్తాను.

Monday, January 7, 2008

Welcome to Viplava Sandesam Telugu Blog విప్లవ సందేశం తెలుగు బ్లాగుకు ఆహ్వానం

నేను దాదాపు 20 ఏళ్లక్రితం విప్లవ సందేశం మాసపత్రిక నడిపాను గాని అనివార్య కారణాలవల్ల ఆపుచేయాల్సి వచ్చింది. అయితే యిప్పుడు సమాచారసాధనాల సాంకేతిక విజ్ఞానం (information technology)లో వచ్చిన ముందంజల్ని ఉపయోగించుకొని మొదట బ్లాగుగానూ, తర్వాత వెబ్‌ పత్రికగానూ నడప సంకల్పించాను. తెలుగు ప్రజల్లో మార్క్సిస్టు, విప్లవాత్మక భావజాలాలు, కార్యాచరణలపట్ల శ్రద్ధాసక్తులు ప్రోత్సహించి, అధ్యయనశీలతను పెంచి, సోషలిజం దిశగా ఒక విశాల వామపక్ష ఐక్యతకు పాటుపడడమే నా ప్రధాన ధ్యేయం.
తెలుగు ప్రజలు, ముఖ్యంగా నెట్‌పాఠకులు అంతా సహృదయంతో సహకరిస్తారని ఆశిస్తాను. అందరికీ నా కొత్త ఏడాది మేలు కోరికలు. నవ సంక్రాంతి శుభాకాంక్షలు. - ఇంగువ మల్లికార్జున శర్మ, సమావేశకర్త (కన్వీనర్‌), మార్క్సిస్టు అధ్యయన వేదిక, 6-3-1243/116, ఎమ్‌. ఎస్‌. మక్తా, రాజ్‌ భవన్‌ ఎదుట, హైదరాబాదు - 500082. ఫోన్‌: 040-23300284.