Sunday, February 3, 2008

శ్రీమతి వెంకటసుబ్బమ్మగారి మరణం 30 జనవరి 2008 నాడు


ప్రముఖ స్వాతంత్ర్యయోధుడు, ఆంధ్ర కమ్యూనిస్టు వుద్యమ ఆది నేతల్లో ఒకరు అయిన కీ. శే. శ్రీ ప్రతాప రామసుబ్బయ్య గారి సతీమణి వెంకటసుబ్బమ్మగారు 94 ఏళ్ల వయస్సులో మొన్న 30 జనవరి 2008 నాడు హైదరాబాదులో మరణించారు. ఆ సందర్భంగా మార్క్సిస్టు అధ్యయన వేదికతరఫున ఈ క్రింది పత్రికా ప్రకటన యిచ్చాము:


మార్క్సిస్టు అధ్యయన వేదిక
MARXIST STUDY FORUM
6-3-1243/116, M.S. Makta, HYDERABAD - 500 082.Ph: 040 - 23300284; E-mail: malliksharma@yahoo.com
(for favour of publication) Dated 30-01-2008
PRESS RELEASE:
HOMAGE TO VENKATASUBBAMMA
Ms. Venkatasubbamma, aged 94 years, wife of veteran freedom fighter and one of the founder members of the Andhra Communist movement, Late Sri Pratapa Ramasubbaiah, is no more amidst us now. She expired at Hyderabad at about 10 A.M. today i.e. Wednesday, 30 January 2008. She herself too had participated actively in the freedom movement and assisted the nascent communist movement. The deceased couple leaves behind four sons, one daughter and several grandsons and granddaughters all of whom are active and well-mannered in various walks of life. We express profound condolences to all of them and pay reverent homage to the memory of Ms. Venkatasubbamma on behalf of our Marxist Study Forum.

[I. MALLIKARJUNA SHARMA]Convener, MARXIST STUDY FORUM.
శ్రీమతి వెంకటసుబ్బమ్మగారి స్మృతికి శ్రద్ధాంజలి
గౌరవనీయురాలు శ్రీమతి వెంకటసుబ్బమ్మగారు, ప్రముఖ స్వాతంత్ర్య యోధులు, ఆంధ్ర కమ్యూనిస్టు వుద్యమ ఆదినేతల్లో ఒకరైన కీ. శే. శ్రీ ప్రతాప రామసుబ్బయ్య గారి సతీమణి, తానుకూడ స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్ర వహించిన, కమ్యూనిస్టు వుద్యమంలో సహాయక పాత్ర వహించిన మంచి మహిళ, ఈ రోజు (30-01-2008) ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాదులో మరణించారు. ఆమె స్మృతిలో మార్క్సిస్టు అధ్యయన వేదిక తరఫున గౌరవపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. శ్రీ ప్రతాప రామసుబ్బయ్య, వెంకటసుబ్బమ్మగార్ల నలుగురు కొడుకులు, ఒక కుమార్తె, మనుమలు, మనుమరాళ్లు అంతా వివిధ రంగాల్లో క్రియాశీలంగా, మంచి నడవడి జీవితాలు గడుపుతూ వున్నారు. వారందరికీ మా ప్రగాఢ సంతాపం తెలియ జేస్తున్నాము.
[ ఇంగువ మల్లికార్జున శర్మ ] 30-01-2008
[పత్రికా ప్రకటన - ప్రచురణార్థం] సమావేశకర్త, మార్క్సిస్టు అధ్యయన వేదిక.